వన్యప్రాణులను సంరక్షిద్దాం

24-04-2024 12:04:12 AM

కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారాం, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల అటవీ అధికారులు శివ్ ఆషీస్ సింగ్, నీరజ్‌కుమార్ తదితర అధికారులతో కలిసి వన్యప్రాణులు, మానవుల సంరక్షణపై మం గళవారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వన్యప్రాణులతో పాటు మానవ జీవితాల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని, ఏనుగుల ఆవాసాలను గుర్తించి అవి జనావాసాల్లోకి రాకుండా రక్షణ చర్య లు తీసుకోవాలని తెలిపారు. అటవీ ప్రాం తంలో నివాసముంటున్న వారితో మాట్లాడి అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అడవుల్లో భద్రతా వాహనాలు, డ్రోన్‌లు, నైట్  విజన్ పరికరా ల ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలను గుర్తించి రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించా రు. సమావేశంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ల్యాండ్‌స్కేప్ జాతీయ సమన్వయకర్త భూమినాథన్, ఏనుగుల ప్రత్యేక కన్జర్వేటర్ నవ నీథన్, పశ్చిమ బెంగాల్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అసిస్టెంట్ మేనేజర్ కుల్‌దీప్‌రాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.