15 April, 2026 | 5:03 PM

రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం

14-04-2026 01:44 AM

ప్రమాదాలను అరికడదాం              

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలను అరికడదామని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని ఆయా గ్రామాలలో సర్పంచులు, పోలీసు అధికారులు పిలుపునిచ్చారు.

ఎరైవ్‌_ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, పోలీస్ అధికారులు సంయుక్తంగా సోమవారం మండలంలోని తాండూర్,  అక్కంపల్లి, వెంకంపల్లి,మాసంపల్లి మార్టూరు,జలార్పూర్,తదితర గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ... ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమని,రోడ్డు భద్రతలో అవగాహన ముఖ్యమని,ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి,సుఖమయ ప్రయాణానికి సహకరించాలన్నారు.

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలని,సురక్షిత ప్రయాణానికి,లైసెన్స్ తో పాటు,హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.నాగిరెడ్డిపేట్ మండలం ప్రాంతాన్ని ప్రమాద రహిత తీర్చిదిద్దేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.మైనర్లు వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని,వారితో పాటు వారి పేరెంట్స్ ను కూడా బాధ్యులుగా చేస్తామన్నారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు భద్రతలో భాగస్వాములు కావాలన్నారు.అనంతరం రోడ్డుపై గల గుంతలను పూడ్చితూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, పోలీస్ అధికారులు,వార్డ్ మెంబర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.