రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- ఆదుపు తప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న తవేరా కారు
- గచ్చిబౌలి సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై ఘటన
శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): గచ్చిబౌలి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న తవేరా కారు అదుపు తప్పి బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొనడంతో కారులోని ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు రాజస్థాన్‌కు చెందిన కనైయాల్ (25), దేరామ్ (24). వీరిద్దరూ కొల్లూరు ఇంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ టైల్స్ పనులు చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలడంతో స్వయం ప్రమాదంగా పరిగణించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






