హిందూ సమాజాన్ని జాగృతం చేద్దాం
ముథోల్ మండల సమ్మేళనం
భైంసా, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి): హిందూ సమాజాన్ని జాగ్రత్తలు చేసేందుకు దేశవ్యాప్తంగా హిందూ జాడో వీరశైవ లింగాయత్ సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు కల్కి భగవాన్ పీఠాధిపతి సరస్వతి ఆనంద్ మహారాజ్ పిలుపునిచ్చారు. గురువారం ముధోల్ మండల కేంద్రంలో నిర్వహించిన మహా ఋషుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి ఉత్తర కాశి నాసిక్ కన్యాకుమారి రాజస్థాన్ వారణాసి తదితర ప్రాంతాలకు చెందిన సాధుసంతులు తరలివచ్చారు. బాసరలో మహా యాగం అమ్మవారి సరస్వతి దర్శనం పాదయాత్రగా మొదలు మండల కేంద్రానికి చేరుకున్నారు.
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలేమని అటువంటి సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని తెలిపారు. హిందూ ధర్మ పరిక్షణ మహాత్మా బసవేశ్వర్ ఆశయాల సాధన తదితరు అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు దేశంలో ఇందుజోడు యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కేంద్రం మాజీ మంత్రి వేణుగోపాల చారి, వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ గౌరవాధ్యక్షులు గంగాధర్ పటేల్ ప్రధాన కార్యదర్శి గణేష్ పటేల్ యూత్ యూత్ అధ్యక్షులు సాగర్ పటేల్ ప్రముఖ వ్యాపారవత్త నాగేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు




