28-10-2025 01:11:01 AM
విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్, అక్టోబర్ 27(విజయక్రాంతి): అందరం ఐక్యంగా ఉంటూ ఏక్ భారత్ లక్ష్యాన్ని సాధించుకుందామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.-ఈనెల 31 న నిర్వహించబోయే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు.
ఏక్ భారత్ - ఆత్మనిర్బర్ భారత్సస పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ఏక్ భారత్ - ఆత్మనిర్బర్ భారత్సస పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్లోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా, గడియారం చౌరస్తా, అశోక్ టాకీస్ మీదుగా పిల్లలమర్రి రోడ్ వరకు 8 కిలోమీటర్ల మీరు ఎక్త మార్చ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ఎకతా మార్చ్ నిర్వహిస్తున్నాం 31 నుంచి నవంబర్ 25 వరకు ఈ ఎక్తా యాత్రలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనిటీ మార్చ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మై భారత్ కేంద్రం ఇంఛార్జ్ కోటా నాయక్, ప్రోగ్రామ్ జిల్లా కోఆర్డినేటర్లు చిల్లా గాల్ రెడ్డి, కృష్ణవర్దన్ రెడ్డి, తిరుపయ్య పాల్గొన్నారు.