28-10-2025 01:13:42 AM
ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, అక్టోబర్ 27: రాత్రి పగలు శ్రమించి పండించిన పంట దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలో మాత్రమే పత్తి విక్రయించాలని ఎంపీడీకే అరు ణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం మహబూబ్ నగర్ గ్రామీణ మం డలం, అప్పాయ పల్లి గ్రామంలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రస్ దగ్గర సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్ర యించాలని ఆయన సూచించారు. పత్తికి 8 శాతం తేమ ఉంటే క్వింటాల్కు రూ.8110 మద్దతు ధ ర , 9 శాతం ఉంటే రూ. 8020 వస్తుందన్నారు. 12 శాతం తేమ ఉండే పత్తిని సైతం పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ,
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రేషన్ కార్డుల జారీ, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ, మహిళలకు వడ్డీలేని రుణాలు, సన్నవడ్లకు బోనస్ అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు గోవింద్ యాదవ్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, లీడర్ రఘు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.