23 June, 2026 | 11:06 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

28-10-2025 01:08 AM

నవాబ్ పేట్ అక్టోబర్ 27: మండల కేంద్రములోని బాలాజీ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని,వారి పంటలకు సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు తమ పంటలను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధరకు విక్రయించి ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. స్థానిక అధికారులు రైతులకు సమయానికి చెల్లింపులు చేయాలని సూచిస్తూ, కొనుగోలు కేంద్రం కార్యకలాపాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్,గిర్దావారు గాయత్రి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం వైస్ చైర్మన్ తులసి రాం నాయక్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు,వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్,నాయకులు వెంకటేష్ గౌడ్, నవాజ్ రెడ్డి ,రమేష్ గౌడ్, నీలకంఠం, రవిందర్ రెడ్డి భూపాల్ రెడ్డి , ప్రతాప్ గోపాల్ గౌడ్, కృష్ణ గౌడ్ వాసు యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.