calender_icon.png 9 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెద్దాం

08-12-2025 12:00:00 AM

  1. మెజార్టీ సర్పంచ్ స్థానాలు దక్కించుకుందాం

అభివృద్ధి పథకాల... అమలు నిరంతర ప్రక్రియ

గ్రామాల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

గజ్వేల్, డిసెంబర్ 7: సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తెద్దామని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయ న హాజరై గజ్వేల్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులను మా జీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డితో కలిసి సన్మానించారు.

అనంతరం మం త్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూశారని, అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కేటాయించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారన్నారు.

రూ 2 లక్షల పంట రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, 200 యూనిట్ల లోపు ఉచిత వి ద్యుత్, రూ 500 కే వంట గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు రూ 500 ల బోనస్, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల అమ లు సాహసోపేతమన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపును స్ఫూర్తిగా తీసుకుని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపునిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అందరి చూపుఅందరి చూపు సిద్దిపేట జిల్లా వైపే ఉందని, ఇప్పటికే పలు స్థా నాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనపెట్టి సర్పంచ్ ఎన్నికలను సవాల్ గా తీసుకొని గెలిపించుకోవాలని, తద్వారా వచ్చే ఎంపీటీసీ, జెడ్పి టిసి ఎన్నికల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.

వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీల అ మలుతోపాటు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని గొప్ప పథకాల శ్రీకారం పై దృష్టి సారిస్తోందని వివరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన జగదేవపూర్ మండలం నిర్మల్ నగర్ సర్పంచ్ కత్తి పద్మారావు, కొండాపూర్ సర్పంచ్ సుప్పరి పుష్ప, పలుగడ్డ సర్పంచ్ కనకయ్య, వర్గల్ మండలం తున్కి మక్తా సర్పంచ్ స్వామి,

కుకునూర్పల్లి మండలం పీటీ వెంకటాపూర్ సర్పంచ్ భాస్కర్ లను మంత్రి శాలువాతో సత్కరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయా మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.