08-12-2025 12:00:00 AM
ఎంపీ గోడం నగేష్ పిలుపు
తలమడుగు, డిసెంబర్ 7(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధి అని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచిం చి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ గోడం నగేష్ కోరారు. తలమడుగు మండలంలోని సుంకిడిలో బీజే పీ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎంపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు.
గత ప్రభుత్వంలో కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులే అభివృద్ధికి దోహదం చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మం డల నాయకులు కనపర్తి చంద్రకాంత్, జక్కుల ప్రభాకర్, మాజీ రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, మాజీ మండల అధ్యక్షులు స్వామి, సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్, బోండ్ల వెంకటస్వామి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నారాయణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.