16-02-2025 12:00:00 AM
ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పానియాల్లో కొబ్బరినీళ్లు ముఖ్యమైనవి. వీటిని తీసుకోవడం వల్ల తాజాగా ఉన్న అనుభూతి కలుగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లలో సహజ ఎలక్ట్రోలైట్ ఉండటం వల్ల తక్షణ శక్తిని పొందొచ్చు. అలాగే హీట్ స్ట్రోక్‌ను నివారిస్తుంది. నిజానికి శరీరంలోని డీహైడ్రేషన్ వల్ల హీట్‌స్ట్రోక్ సమస్య వస్తుంది.
ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసట, బద్ధకం, బలహీనత వంటి సమస్యలు దరిచేరవు. అలాగే ఎముకలు, కండరాలను కూడా బలపరుస్తుంది. చర్మం మెరిసిపోవడంతోపాటు అకాల ముడతలు లాంటి సమస్యలు దరిచేరవు. మొటిమల సమస్యనూ తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే.. కొబ్బరి నీళ్లు డయాబెటిక్ రోగులకు బాగా పనిచేస్తాయి.