calender_icon.png 2 February, 2026 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోజనం తర్వాత తీపి తినొద్దు!

16-02-2025 12:00:00 AM

భోజనానికి ముందు స్వీట్లు తీసుకుంటే ఆహారం జీర్ణమయ్యే హార్మోన్లు శరీరంలో ఉత్తేజితమవుతాయి. కానీ భోజనం తర్వాత స్వీట్లను తీసుకుంటే అది నేరుగా జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్లు. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

స్వీట్లు ఎక్కువగా తింటే అది ఆరోగ్యానికి హానికరం. ఇది ఆహారాన్ని పాడు చేస్తుంది. ఆయుర్వేద నియమాల ప్రకారం.. భోజనానికి ముందు కొన్ని స్వీట్లు తినమని సలహా ఇస్తారు.

ఇది శరీరంలో యాసిడ్ లేదా ఎసిడిటీ తీవ్రతను తగ్గిస్తుంది. ఫలితంగా గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి పొట్ట సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. కానీ భోజనం తర్వాత తింటే మాత్రం ప్రతికూల సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.