ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం..
తాడ్వాయి, మే, 27( విజయ క్రాంతి): ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం... ప్రకృతిని కాపాడదమని తాడువాయి ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలిద్దామని తెలిపారు ప్లాస్టిక్ ను నిర్మూలించడంతో ఎన్నో లాభాలు కలుగుతాయిన్నారు.
ఇప్పటికే మన మండలంలోని కొన్ని గ్రామాలు ప్లాస్టిక్ ను నిషేధించాయని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ. 2 కోట్ల బ్యాంకు రుణాల చెక్కును అందించారు.వడ్డీ రాయితీ రూ.43 లక్షల 3 వేల 640 చెక్కును, ప్యాడి కమిషన్ రూ.2 లక్షల 89104 చెక్ ను అందించారు. మహిళలు సంఘాల నుంచి,బ్యాంకు ల నుంచి రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ సంఘాల ప్రతినిధులను ఘనంగా సంభందించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు సత్యభాయి, ఏపిఎం రాజు, సీసీలు రాజారెడ్డి, మెహర్ కుమార్,శ్రీనివాస్, నర్సింలు, అంజయ్య, రాజయ్య, అకౌంటెంట్ తిరుపతిరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.






