ఘనంగా మహేశ్వర్‌రెడ్డి జన్మదినం
పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు..
సికింద్రాబాద్, మే 27 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో పార్టీ నాయకులు,యువత, కాలనీ వాసులు, అభిమానులు, అనుచరుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు,కార్యకర్తలు,ప్రజలు ఆయనకు పుష్పగుచ్చాలు అంద చేసి,శాలువాతో సన్మానించి,కేక్ కటింగ్ చేయించి జక్కుల మహేశ్వర్ రెడ్డి కి పార్టీలకు అతీతం గాజన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ బోర్డు పరిధిలోప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి,కాలనీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జక్కుల మహేశ్వర్ రెడ్డి ప్రజాసేవలో కొనసాగుతూ ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన నాయకత్వాన్ని కొనియాడారు.






