12-02-2026 06:42:14 PM
ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్
ఖానాపూర్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యతిరేక లేబర్ కోడ్స్ ,రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మిక రైతులను నిలువునా దోపిడీ చేస్తుందని, పేర్కొంటూ ఆ విధానాలను నిరసిస్తూ గురువారం నిర్మల్ జిల్లా తర్లపాడు గ్రామం వద్ద నిర్మల్ మంచిర్యాల రోడ్డుపై రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ మాట్లాడుతూ పలు పోరాటాలు,
త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడలుగా తేవడం, అమలుకు పూనుకోవడం అత్యంత దుర్మార్గమని రైతు కార్మికుల పోరాటాల చరిత్ర తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని, బిజెపి మోడీ ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను, విత్తన, విద్యుత్ సవరణ, విబిజి రామ్ జి బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం దారుణమని, మోడీ పాలన అర్థరహితమని ఈ చట్టాలు రైతులను, కార్మికులను అనేక కష్టాలకు గురి చేస్తాయని అన్నారు.