calender_icon.png 24 September, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లంబాడీ భేరి’ని విజయవంతం చేద్దాం

24-09-2025 12:35:20 AM

వనపర్తి టౌన్ సెప్టెంబర్ 23:ఈ నెల 26న బిఆర్‌ఎస్ ఆధ్వర్యములో జరిగే లంబాడీ భేరి విజయవంతం చేయాలనీ సన్నాహక సమావేశంలో పార్టీ జిల్లా ఎస్.టి.సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్, జాతృ నాయక్ లు అన్నారు.

మంగళవారం మాజీ మంత్రి స్వగృహంలో జరిగిన మీడియా సమావేశములో వారు మాట్లాడుతూ లంబాడీలకు కె.సి.ఆర్ అన్నం పెడితే. రేవంత్ రెడ్డి సున్నం పెడుతున్నాడనీ అభివృద్ధి చేతకాక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. కె.సి.ఆర్ లంబాడీల భవిష్యతు కోసం అనేక సంక్షేమ పథకాలు లంబాడీల రిజర్వేషన్లకు భాగం వాటిల్లకుండా మా హక్కులు కాపాడితే నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మంత్రి సీతక్క ఎస్.టి.జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసులు వేయించాడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఎస్.టి. జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగ బి. ఆర్.ఎస్ ఆధ్వర్యములో ఈ నెల 26న లంబాడీల భేరి నిర్వహిస్తున్నామని లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మన హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్నికి మద్దతు తెలపాలన్నారు. ఈ సమావేశంలో నారాయణ నాయక్, టీక్యా నాయక్,కృష్ణా నాయక్,గోపాల్ నాయక్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.