24-09-2025 12:34:28 AM
* 18 ఏళ్ళుగా దుర్గమాతను నెలకొల్పడం ఎంతో అదృష్టం
* మెదక్ ఎంపీ కాంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, సెప్టెంబర్ 23 :దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. దేవి శరన్నవరాత్రుల ఉ త్సవాలను పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్ గ్రామంలోని తన ఇంటి ఆవరణలో గత 18సంవత్సరాల నుండి నెలకొల్పుతున్న దుర్గమాత సన్నిధిలో నిర్వహించిన పూ జా కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరన్నవరాత్రులను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. లోక శాంతి కోసం దేవి శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు గా అమ్మను పూజించి ఆరాధిస్తారని తెలిపారు. అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో పరిఢవిల్లాలని ఆయన ఆకాంక్షించారు.