calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కాలనీలలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

24-09-2025 12:36:06 AM

* త్వరలో రూ.6 కోట్లతో బాక్స్ డ్రైనేజీ పనులు

* ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్ చెరు, సెప్టెంబర్ 23 :తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామాల పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో వరదనీరు మూలంగా ఏర్పడుతున్న సమస్యకు శాశ్వత ముగింపు పలుకుతూ అతి త్వరలో రూ.6 కోట్లతో బాక్స్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ముత్తంగి పరిధిలోని విజేత కాలనీ, చిట్కుల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ, రమణయ్య ఎంక్లేవ్, నాగార్జున కాలనీ, రాధమ్మ కాలనీ, బాలాజీ నగర్, బృందావన్ కాలనీ, రాయల్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పర్యటించారు.

వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. స్వయంగా ప్రజలను కలిసి వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ముత్తంగి, ఇస్నాపూర్ చెరువుల నుండి అలుగులు పారుతూ జాతీయ రహదారి మీదుగా ప్రవహిస్తున్న నీటిని కాలనీలలోకి వెళ్లకుండా నూతన బాక్స్ డ్రైనేజీ ద్వారా చిన్న వాగు లోకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ముత్తంగి గ్రామ పరిధిలోని విజేత కాలనీలో అతి త్వరలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం చిట్కుల్ గ్రామంలోని స్వయంభు తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదానికి రూ.లక్ష విరాళంగా అందించారు. 

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ...

పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 125 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 57 లక్షల 74 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సాకిచెరువుపై బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు.