బీజేపీ సర్కారును సాగనంపుదాం
03-05-2024 01:43 AM
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఖమ్మం, మే 2 (విజయక్రాంతి): జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్.ఆర్ గార్డెన్స్ లో శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురాంరెడ్డితో కలిసి సీపీఎం నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బిలియనేర్ అదానీ దోచుకున్న దాంట్లో 70 శాతం ప్రధాని మోదీకే అప్పగించాడని తాజాగా ఓ విచారణలో వెల్లడైందన్నారు. అనంతరం మంత్రులు తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి బీఆర్‌ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలనిపిలుపునిచ్చారు. సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు పాల్గొన్నారు.




