హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుదాం
టీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ...
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుదామని టీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం బలోపేతం కోసం మండల, జిల్లా స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టు సంక్షేమానికి మీడియా ఆకాడమీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్నో కార్యక్రమలను ముందుకు తీసుకువేళ్లడం జరిగిందన్నారు.
జర్నలిస్టు మిత్రలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇండ్ల స్థలాలు, ఇండ్ల మంజూరు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చేలా పోరాటం చేయడం జరుగుతుందన్నారు. పోరాటాలు చేయడం జర్నలిస్టులకు కొత్తేమి కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రవినాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి హన్మయ్య, యోగానంద స్వామి, వెలుగు స్టాఫర్ మాసడే సంతోష్, ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు దీకొండ సతీష్, అధ్యక్షుడు చిప్ప సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, సీనియర్ జర్నలిస్టులు తుకారం, రామస్వామి, బాబా, ఖలీల్, చందు తదితరులు పాల్గొన్నారు.






