18 April, 2026 | 11:19 AM

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నగేష్ నాయక్ నియామకం

08-12-2024 06:44 PM

కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్... 

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ దివంగత నాయకులు సురేష్ నాయక్ సోదరుడు నగేష్ నాయక్ కు డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఎంబీసీ చైర్మన్ జరిపేటి జయపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని కాంగ్రెస్ ఎంబిసి చైర్మన్ జేరిపేటి జైపాల్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ పట్టిష్టత కోసం కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన సురేష్ నాయక్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని సురేష్ నాయక్ కు ఏ మాత్రం తగ్గకుండా ఆయన సోదరుడు నగేష్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని జెరిపేటి జైపాల్ అన్నారు.

అనంతరం నూతన అధ్యక్షుడు నగేష్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం దాదాపు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుందని తెలిపారు. తన సోదరుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ తన ఊపిరిగా శ్వాసగా, రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న సమయంలోను తమ సోదరుడు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్న కార్యకర్తలను పిలుపునిచ్చి తూచా తప్పకుండా అమలు చేసేవాడని గుర్తు చేశారు.

డివిజన్ అధ్యక్ష బాధ్యతలను నాకు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా మధుసూదన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నియమకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల శ్రీనివాస్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు, హరి, ఓబీసీ నియోజకవర్గ ఛైర్మన్ హనీఫ్, సద్దాం, ప్రేమ్, సిరాజ్, నరేష్, సదర్, లక్ష్మి, లక్ష్మీ ప్రసన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.