వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణాస్వీకారోత్సవం
బిచ్కుంద మండలం వాజీద్‌నగర్ గ్రామంలో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణాస్వీకారోత్సవం ఆదివారం వాజిద్‌నగర్‌లోని బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గంను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ది వైపు పరుగులు తీస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. దానికి నిదర్శనం ఈ మధ్య మన నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లు నిదర్శనమన్నారు. అంతేకాకుండా స్పోర్ట్ స్కూల్, నర్సింగ్ కళాశాలను కూడా నియోజకవర్గానికి తీసుకొస్తానని తెలిపారు.
నిజామాబాద్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని జుక్కల్ నియోజకవర్గానికి తరలిస్తామని చెప్పారు. అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్, కౌలాస్ నాలా, కౌలాస్ కొటను పర్యాటకంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. గుల్ల గ్రామం నుండి సిరిసిల్లా వరకు హైవే నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిచామన్నారు. మద్నూర్ నుండి బోధన్ వరకు నేషనల్ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటి చైర్మన్‌ల నియామక ప్రక్రియను సహకరించిన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు గౌరవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






