calender_icon.png 18 July, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్దాం

18-07-2025 12:00:00 AM

  1. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిద్దాం 

నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 

కోయిల్ కొండ జూలై 17 : పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్దామని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం కోయిలకొండ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సందర్భంగా బి lఆర్‌ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు.

బిఆర్‌ఎస్ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషమైన జీవితాన్ని గడిపారని, కాంగ్రెస్ రావడంతోనే ప్రతి ఒక్కరికి కష్టాలు తీసుకువచ్చిందన్నారు. జరగనున్న జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలలో కారు కు మద్దతు తెలియజేసి పూర్వ వైభవం తీసు కువద్దామని పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రతి ఒక్కరి సం క్షేమమే తమ లక్ష్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ సమన్వయకర్త ఎస్ రవీందర్ రెడ్డి, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు మాజీ జెడ్పిసిలు పి ఎస్ ఎస్ సి చైర్మన్ టిఆర్‌ఎస్ పార్టీ కమిటీల అధ్యక్షులు కార్యదర్శులు, నాయకులు ఉన్నారు.