18-07-2025 12:00:00 AM
గద్వాల టౌన్, జూలై 17 : జిల్లా లోని పత్తి సీడ్ రైతుల తో సీడ్ పత్తి కంపెనీలు,ఆర్గనైజర్లు నడిగడ్డ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని నడిగడ్డలో 30 ఏళ్లుగా 40 మంది ఆర్గనైజర్లు 35వేల మంది రైతులతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా లో రైతులు మాట్లాడుతూ 1ఎకరాకు 2 కింటాలు కొనుగోలు చేస్తామని అనడంతో రైతులు సాగు చేసిన సీడ్ పత్తి పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ తమ దగ్గర వచ్చి హామీ ఇచ్చే దాకా ధర్నాను విరమించబోమని ఆర్గనైజర్లు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని రైతులు ఆవేదన చెందారు.పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.