calender_icon.png 18 July, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు డిజిటల్ పబ్లిక్ లైబ్రరీ ఒక వరం

18-07-2025 12:00:00 AM

ఎంపీ మల్లు రవి 

వనపర్తి టౌన్ జులై 17: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు డిజిటల్ పబ్లిక్ లైబ్రరీ ఒక వరమని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి అన్నారు.గురువారం జిల్లా కేం ద్రంలోని జిల్లా గ్రంథాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సిఎస్‌ఆర్ లో భా గంగా ఏర్పాటుచేసిన డిజిటల్ లైబ్రరీని ఎంపీ మల్లురవి,ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ గో వర్ధన్ సాగర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి,రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు డిజిటల్ లైబ్రరీ ఒక వరమని అ న్నారు. ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని విషయాలను ఆన్లైన్ క్లా సెస్ ద్వారా వినవచ్చని చెప్పారు.ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి డిజిటల్ లైబ్రరీ వనపర్తి లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య,డి ఆర్ డి ఓ ఉమాదేవి, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం భాస్కరరావు, రీజనల్ హెడ్ సత్యనారాయ ణ,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.