calender_icon.png 15 July, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి

15-07-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 14 (విజయక్రాంతి): క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థినిలు హిమబిం దు, బిక్కుబాయి ఇటీవల ఎవరెస్టు శిఖరం బేస్ పాయింట్ చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని చాంబర్‌లో ఎవరెస్ట్ ఎక్కి న విద్యార్థినిలను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి కలెక్టర్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతోపాటు తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించేందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ స్ఫూర్తితో వివరిస్తూ అధిరోహించాలని విద్యార్థులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూవో ఆడెపు భాస్కర్, డిఆర్‌డిఓ దత్త రావు, పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య ఉన్నారు.