15-07-2025 12:00:00 AM
చారకొండ జులై 14: మండల ఎంపీడీవో గా శంకర్ నాయక్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో బా ధ్యతలు చేపట్టారు. కల్వకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో సూపరిండెంట్ గా పనిచేస్తున్న విజయ భాస్కర్ ఈనెల 11న చారకొండ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టారు.
మళ్లీ తిరిగి కల్వకుర్తి కార్యాలయానికి వెళ్లారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న శంకర్ నాయక్ బదిలీపై చారకొండ కొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ నాయక్ మాట్లాడుతూ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి మండల అభివృద్ధికి కృషి చేస్తాననిపేర్కొన్నారు.