14-07-2025 11:31:07 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla kavitha)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) దిష్టిబొమ్మను సోమవారం రాత్రి బెల్లంపల్లిలో తెలంగాణ జాగృతి శ్రేణులు దహనం చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్య తీసుకోవాలని పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. మల్లన్న వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా ప్రతినిధులు ఈట రాకేష్, నియోజకవర్గ అధ్యక్షులు పుల్లూరి మౌనిక్, రెడ్డవేణ శ్రీనాథ్, కందుల స్వరాజ్, బండారి రేవంత్, సళ్ళ సాయి, సల్మాన్, మహంతి, నితిన్, గౌతమ్, ఆశిష్, కుషాల్, డన్ను, బబ్లూ, బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు ఆడేపు అరుణ్,చరణ్,సుమంత్ నాగసాయి, రోహిత్, అభిలాష్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.