calender_icon.png 3 May, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రభుత్వ అధికారులను కాపాడుకుందాం

02-05-2025 09:35:36 PM

జిల్లా వైద్య శాఖ అధికారి అన్న ప్రసన్నకి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు

నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ నడిపిస్తున్న మమత హాస్పిటల్ ను సీజ్ చేసి అరెస్టు చేయాలి

గోదావరిఖని,(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ అధికారులను కాపాడుకుందామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధన మేరకే పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య శాఖ అధికారి అన్న ప్రసన్న గోదావరిఖని పట్టణంలోని మమత హాస్పిటల్ ను తనిఖీ చేశారని, దాన్ని కొంత మంది రాజకీయ నాయకులు రాద్ధాంతం  చేయడం సరికాదని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వారికి హితవు పలికింది. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో డిఎంఅండ్ హెచ్ఓ, అన్న ప్రసన్నను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు కలిశారు.

పెద్దపెల్లి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా అధికారిగా తనిఖీ చేస్తే తప్పు ఏందని, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి మాజీ సర్పంచ్, మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకే జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ అధికారి అన్న ప్రసన్న తనిఖీ చేస్తుందని, అందులో భాగంగానే గోదావరిఖని పట్టణంలోని మమత హాస్పిటల్ ను తనిఖీ చేశారన్నారు. 2923లో గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణకు సంబంధించిన స్కానింగ్ మిషన్ ఏర్పాటుచేసి ఎలాంటి అనుమతి లేకుండా నడిపిస్తుంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లింగ నిర్ధారణ స్కానింగ్ మిషన్ ను నడిపిస్తున్న ఆసుపత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, కొంతమంది రాజకీయ నాయకులు వారికి మద్దతు తెలపడం బాధాకరమన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి రాజకీయ నాయకులు మద్దతు అంటూ ప్రశ్నించారు. తన విధిలో భాగంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. తప్పుడు మార్గంలో ఆసుపత్రిని నిర్వహిస్తున్న నిర్వాహకులకు మద్దతు తెలుపుతున్న రాజకీయ నాయకులు మరోసారి ఆలోచన చేయాలన్నారు. అక్రమంగా డిఎం అండ్ హెచ్ఓపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ కలెక్టర్,కు విజ్ఞప్తి చేశారు. మాజీ మేయర్, డాక్టర్  బంగి అనిల్ కుమార్ ను, మాజీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామిని మమత ఆసుపత్రి  నిర్వాహకులు పాములుగా వాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు జీవితాన్ని 2023 నుండి నిర్ధారణల మిషన్ వినియోగిస్తున్న ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేసి, ఇరువాకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ని కూడా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును, కూడా కలవనున్నట్లు వారు వెల్లడించారు. పెద్దపెల్లి జిల్లా వైద్య శాఖ అధికారిని కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్, మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జిల్లా కో కన్వీనర్ సంకనపల్లి లక్ష్మయ్య బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కట్టుకూరి సందీప్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపెల్లి మండల అధ్యక్షులు, బోసెల్లి నారాయణ, కన్నూరి బాపు, కాటుకూరి సంతోష్, కనుకుంట్ల రమేష్ తదితరులు ఉన్నారు.