02-05-2025 08:57:58 PM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు
తాడ్వాయి,(విజయక్రాంతి): రైతుల సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో శుక్రవారం ఆయన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. రూ. 2.11 కోట్లతో నిర్మించనున్న ఈ సబ్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు మదన్మోహన్ రావు తెలిపారు. 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తే ఇక్కడి గ్రామాల ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు. తాడ్వాయి మండలంలోని 11 నుంచి 14 గ్రామాలు రైతులు విద్యుత్ సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిందని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు, మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి సీనియర్ నాయకులు యూత్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు