calender_icon.png 23 February, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడులను పరిరక్షించుకుందాం

23-02-2026 02:06:04 AM

ఎస్టీయూ రాష్ట్ర విద్యా సదస్సులో ప్రొఫెసర్ కాశీం

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ప్రొఫెసర్ కాశీం అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ(ఎస్టీయూ టీఎస్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ అధ్యక్షతన రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా నిర్వహించిన విద్యా సదస్సులో ప్రముఖ విద్యారంగ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కాశీం ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేసే ఆలోచన విరమించుకోవాలని, విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలని కోరారు. రాష్ర్టంలో విద్యావిధానంలో సమూల మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులకు  బోధనేతర పనులు అప్పగించరాదని, పాఠశాలలకు నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..

ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ, సంఘ అధికార మాస పత్రిక ఎడిటర్ ప్రసాద్, సబ్ ఎడిటర్ శంకర్ మాతంగి,హెడ్ సెక్రటరీ కరుణాకర్‌రెడ్డి, నాయకులు ఏవీ సుధాకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.