8 May, 2026 | 8:22 PM

సమర్థుడైన వెంకట్రాంరెడ్డికే పట్టం కడుదాం

26-04-2024 12:10 AM

l ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : వెంకట్రాంరెడ్డి సమర్థుడని, పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీగా ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గురవారం అమీన్‌పూర్ మున్సిపల్  పరిధిలోని మున్సిపల్ వైస్ చైర్మ న్ నందారం నర్సింహాగౌడ్ నివాసంలో ము న్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ స్థాయి బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఈ నెల 28న సన్నాహాక సమా వేశా నికి అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.

మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ తాను పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తినని, గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. అదే విధంగా బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతుగా ఈ నెల 27న నిర్వహించే భారతినగర్, రామచంద్రాపురం డివిజన్ మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.