8 May, 2026 | 9:27 PM

ఎంఎంటీఎస్ ఫేజ్ ట్రాక్ పనులు షురూ..

26-04-2024 12:10 AM

l 90 రోజుల్లో లాలాగూడ సీతాఫల్‌మండి.. మధ్యన ‘కార్డ్‌లైన్’ అందుబాటులోకి

l ఇకపై కాజీపేట నుంచి వచ్చే రైళ్లు నేరుగా కాచిగూడకు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): నగరంలో  పెరుగుతున్న జనా భాకి మెరుగైన ప్రజారవాణా సౌకర్యం కల్పించడానికి దక్షిణమధ్య రైల్వే చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్ ప్రాజెక్ట్‌లో చివరి రైల్వేట్రాక్ లైన్ లాలాగూడ మధ్యన 4కి.మీల కార్డ్‌లైన్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైలునిలయం నుం చి తార్నాక వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలుగడ్డ బావి వద్ద ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జిని పొడగించాల్సిన అవసరం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ట్రాక్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆలుగడ్డ బావి వద్ద ఉన్న అండర్‌పాస్ యొక్క రెండు వెంట్లను 45 రోజుల పాటు ఒకదాని తర్వాత ఒకటి మూసివేయాల్సి ఉంటుందని, 90రోజుల్లో కార్డ్‌లైన్ ట్రాక్ పనులు పూర్తి చేస్తామన్నారు.

విజయవాడ వైపు నుంచి వచ్చే..

లాలాగూడ మధ్యన చేపట్టిన కార్డ్‌లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ వైపు నుంచి వచ్చే రైళ్లు నేరుగా సీతాఫల్‌మండి మీదుగా కాచిగూడ రైల్వే స్టేషన్‌కు మళ్లీంచడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయా ణం ద్వారా దూరం తగ్గడంతో పాటు సమ యం ఆదా అవుతుందని తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్‌న ప్రాజెక్టులోని చివరిదశ అయి న మల్కాజిగిరి నుంచి సీతాఫల్‌మండి, మౌ లాలీ స్టేషన్ల మధ్య ఉన్న సింగల్‌లైన్‌ను పొడగించడం, విద్యుద్దీకరణ లాంటి పనులు చేప ట్టామని అధికారులు పేర్కొన్నారు.