9 May, 2026 | 10:44 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

మరో స్వదేశీ ఉద్యమానికి నాంది పలకాలి

30-06-2025 03:12 AM

మెదక్, జూన్ 29(విజయక్రాంతి): దేశంలో మరో స్వదేశీ ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా స్వదేశీ జాగరణ మంచ్ కో- కన్వీనర్ అజయ్ పాతక్ జీ, తెలంగాణ స్వదేశీ జాగరణ మంచ్ సంఘటన మంత్రి రచ్చ శ్రీనివాస్ జీ తెలిపారు. మెదక్ పట్టణంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అజయ్ పత్రిక్ జీ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

స్వదేశీ జాగరణ మంచ్ దేశంలోని రైతులను, వ్యాపారులను, కార్మికులను సంఘటితం చేసి  దేశీ వస్తువులను వాడాలని, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, నూతన ఉద్యోగ అవకాశాలు యువతకు లభించి స్థానిక వస్తువులకు డిమాండ్ పెరిగితే అభివృద్ధి చెందుతుందన్నారు. స్వదేశీ, సురక్ష, స్వాలంబన్, అభియాన్ సాధించే దశగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ డాక్టర్ ఎస్.నారాయణ గుప్తా, ప్రవీణ్ కుమార్( లెక్చరర్ ), భాజపా ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా గడ్డం కాశీనాథ్, మెదక్ బార్ కౌన్సిల్ నాయకులు సుభాష్, వ్యాపారవేత్త శివకృష్ణ, యాదగిరి, వెంకటేష్ పాల్గొన్నారు.