10-05-2025 12:20:04 AM
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్
మహబూబ్ నగర్ మే 9 (విజయ క్రాంతి) : కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం కు ఈనెల 20న చేపడుతున్న సమ్మె సారాంశాన్ని తెలియజేసేలా ముందుకు సాగుదామని సిఐటియు గ్రామ పంచాయతీ, మున్సిపల్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రామపంచాయతీ, మున్సిపల్ రంగాల సంబంధించిన జిల్లా సదస్సు సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. ఈనెల 20న చేపట్టబోయే సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి కురుమూర్తి తదితరులు ఉన్నారు.