calender_icon.png 11 May, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యికిపైగా రోబోటిక్ శస్త్ర చికిత్సలు

10-05-2025 12:17:44 AM

-బెనిన్ గైనకాలజీ విభాగంలో అపోలో ఆస్పత్రి వైద్యురాలి ఘనత

-దేశంలో తొలి మహిళా సర్జన్‌గా గుర్తింపు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): బెనిన్ గైనకాలజీ విభాగంలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నట్లు జూబ్లీహిల్స్‌లో ని అపొలో ఆస్పత్రి సగర్వంగా ప్రకటించిం ది. ఆస్పత్రికి చెందిన గైనకాలజిస్టు, రోబోటిక్ సర్జరీ వైద్యురాలు, సీనియర్ కన్సల్టెంట్ డాక్ట ర్ రూమా సిన్హా నేతృత్వంలో వెయ్యికంటే ఎక్కువగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.

దీంతో ఈ విభా గంలో డాక్టర్ రుమా సిన్హా దేశంలోనే అత్యధిక సర్జరీలు చేసిన వైద్యురాలిగా నిలిచారు. సంక్లిష్ట ఫైబ్రాయిడ్లు, అధునాతన ఎండోమెట్రియోసిస్ చికిత్సలో నిపుణురాలైన డాక్టర్ రుమాసిన్హా రోబోటిక్ సహాయక గైనకాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ఈ సందర్భంగా అపొలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రోబోటిక్ సర్జరీ విభాగంలో అపోలో ఆస్పత్రి స్థానాన్ని అగ్రస్థానంలో నిలపడంలో ఈ విజయం విశదీకరిస్తుందన్నారు.

తెలంగాణ ప్రాంత అపొలో ఆస్పత్రుల సీఈవో తేజస్విరావు మాట్లాడుతూ.. డాక్టర్ రుమా సాధిం చింది నైపుణ్యం యొక్క విజయం మాత్రమే కాదని, ఈ అంశంపై సునిశితతమైన దృష్టి సారించడం అని అన్నారు. మనదేశంలో రోబోటిక్ గైనకాలజీని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ఆమె ఎంతగానో కృషి చేసిందని ప్రశంసించారు.