11-05-2025 04:43:13 PM
తాను అడిగిన ఐదు ఫుల్ బాటిళ్లు ఇవ్వులేదని దుకాణానికి తాళం
సుమారు రెండు గంటలపాటు మద్యం దుకాణాలు మూత
తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న మద్యం ప్రియులు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ శాఖ అధికారి తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ మద్యం దుకాణంపై రుబాబు చూపించాడు. తనకు ఐదు ఫుల్ బాటిల్లు కావాలని లేదంటే మద్యం దుకాణం మూసివేయాలంటూ హెచ్చరించాడు. చివరికి మద్యం బాటిళ్లు ఇవ్వలేదని దుకాణానికి తాళం వేయించాడు. దీంతో విషయం తెలుసుకున్న మిగతా మద్యం దుకాణాదారులు సుమారు రెండు గంటల పాటు మద్యం దుకాణాలు మూసేశారు.
దీంతో మద్యం ప్రియులు ఆదివారం సెలవు దినం వేల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తరచూ మద్యం బాటిల్లు ఆయా శాఖ అధికారులు బలవంతంగా వసూలు చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు మద్యం దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు శ్రద్ధ వహించి మద్యం దుకాణాదారుల నుండి తరచు మద్యం ఇతర మామూళ్లను వసూళ్లు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.