7 July, 2026 | 2:08 AM

ముత్తారంలో త్వరలో గ్రంథాలయాల ఏర్పాటు

07-07-2026 12:00 AM
  1. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్
  2. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ముత్తారం, దర్యాపూర్ లలో స్థలాల పరిశీలన
  3. గ్రామీణ విద్యార్థులకు, నిరుద్యోగులకు డిజిటల్ లైబ్రరీల ద్వారా భరోసా
  4. త్వరలోనే పనులు ప్రారంభం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్

ముత్తారం, జూలై 6 (విజయ క్రాంతి)ముత్తారం మండల కేంద్రంతో పాటు దర్యాపూ ర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో త్వరలోనే నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మండలంలో ని పలు ప్రాంతాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాలను స్థానిక నాయ కులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుల ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని, అన్ని వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థలాల ఎంపికపై అధికారులతో చ ర్చించి, తదుపరి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

 మంత్రి శ్రీధర్ బాబు చొరవతోనే అభివృద్ధి

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణాలకు సమానంగా విద్యా వనరులు అందిం చాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు లైబ్రరీల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు, అనుమ తులు మంజూరు చేస్తున్నారని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రావు, డీసీసీ కార్యదర్శి అంబటి చంద్రమొగిలి, డీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు తాళ్లపల్లి కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ మ ద్దెల రాజయ్య, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బియ్యాని శివకుమార్, స్థానిక స ర్పంచ్ రాపెల్లి రాజయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యు లు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.