7 July, 2026 | 2:14 AM

దళిత ఎమ్మెల్యే సామేలు జోలికొస్తే సహించేది లేదు

07-07-2026 12:00 AM

రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 6: తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించినా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించడం బాధాకరమైన విషయమని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల రమేష్ తీవ్రంగా వ్యతిరేకించారు.

సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ అయిన తుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన ఎమ్మెల్యే మందుల సామ్యూల్ పై ఆధార రహిత ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదని హెచ్చరించారు. అధికార పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అవిలయ్య, నాయకులు రవీందర్, జీడి భాస్కర్, ఇటికాల చిరంజీవి తదితరులున్నారు.