calender_icon.png 11 July, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఐసీలో మరోసారి వాటాల విక్రయం

11-07-2025 12:00:00 AM

  1. ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి 96.5శాతం వాటా

సెబీ నిబంధనల మేరకు 10శాతం వాటా విక్రయం తప్పనిసరి

న్యూఢిల్లీ, జూలై 10: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో మరోసారి వా టాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో ఈ వాటాల విక్రయ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

2022 మే నెలలో తొలిసారి ఐపీవో ద్వారా కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒక్కో షేర్‌కు రూ.902 నుంచి రూ.949 ధర శ్రేణిగా పేర్కొంది. దాని ద్వా రా రూ.21వేల కోట్లను సమీకరించింది. ప్ర స్తుతం ఎల్‌ఐసీలో కేంద్రానికి వాటా 96. 5శాతం ఉంది. సె బీ నిబంధనల ప్ర కా రం..2027 మార్చి నాటికి లిస్టెడ్ కంపెనీలలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీసం 10% చేరాల్సి ఉంది.

ఈ నిబంధనను అం దుకునేందుకు కేంద్రం మరో 6.5శాతం వా టాను విక్రయించాల్సిందే. వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు స మాచారం.  ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్ వి లువ సుమారు రూ.5.85లక్షల కోట్లు ఉ ండగా, షేరు ధర రూ.926వద్ద ట్రేడ్ అవుతోంది.