calender_icon.png 11 July, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేండ్లు నేనే సీఎం

11-07-2025 12:00:00 AM

నాయకత్వ మార్పుపై కర్ణాటక   సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 10: నాయకత్వ మార్పు పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. కన్నడనాట నాయకత్వ మా ర్పుపై వస్తున్న ఊహాగానాలను గురువారం ఆయన కొట్టిపారేశారు. ఐదేండ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని వెల్లడించారు. ఈమేరకు జాతీయ మీడియాతో మా ట్లాడుతూ.. “సీఎంగా నేను ఐదేండ్లు ఉం టాను. ఈ విషయాన్ని నేను ఎప్పుడో స్పష్టం గా చెప్పాను.

జూలై 2వ తేదీని కూడా దీనిపై ప్రకటన విడుదల చేశా. ఆ సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్క డే ఉన్నారు. ఆయన కూడా పోటీదారే, అం దులో తప్పేముంది. ‘కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదు’ అని ఆయనే చెప్పారు” అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పులపై పార్టీ అధి ష్ఠానం తుది గడువు విధించడం, లేదా సూచనలు లాంటివి ఏమీ చేయలేదని సిద్ధరా మయ్య వెల్లడించారు.

రెండున్నరేండ్ల అంశా న్ని ఎవరూ నిర్ణయించలేదని చెప్పుకొచ్చా రు. హైకమండ్ నిర్ణయం తీసుకుంటే తమకు సమాచారం ఇస్తుందని.. వాటిని తాము అమలు చేస్తామని చెప్పారు.