11-07-2025 12:00:00 AM
హర్యానాలో దారుణం
ఛండీగఢ్, జూలై 10: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఒక టెన్నిస్ క్రీ డాకారిణిని ఆమె కన్నతండ్రి కాల్చి చం పడం కలకలం రేపింది. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25) గురుగ్రా మ్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఈ క్రమంలో రాధిక గురువారం ఇంట్లో వంట చేస్తుండగా.. ఆమె తండ్రి దీపక్ యాదవ్ వెనుక నుంచి వచ్చి ఆమెపై కాల్పులు జరిపాడు.
ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందింది. సోషల్ మీడియాలో తరచూ రీల్స్ చేస్తుండటం రాధిక తండ్రి దీపక్‌కు నచ్చలేదు. రీల్స్ చేయడం వల్ల తమ కుటుంబానికి అవమానం కలు గుతుందనే భయంతోనే దీపక్ రాధికను కాల్చి చంపినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు.
రాధిక ప్రవర్తనతో గత 15 రోజులుగా విసిగిపోయానని.. రీల్స్ వద్దని వారించినా వినకపోవ డంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.