calender_icon.png 12 May, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేయర్ శిక్షణ కొరకు దరఖాస్తుల స్వీకరణ

11-05-2025 07:29:05 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) ద్వారా లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తెలంగాణలోని అన్ని మీసేవ కేంద్రాల్లో లైసెన్స్ సర్వైశిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 50 పని దినాల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

అభ్యర్థుల అర్హతలు

ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, గణితశాస్త్రం ఒక అంశంగా ఉండాలి. ఐటిఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లమా (సివిల్), బీటెక్ (సివిల్), లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగిన వారు మే 17 వరకు మీసేవ కేంద్రాల ద్వారా వంద రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఓసి కేటగిరి 10 వేలు, బిసి అభ్యర్థులు 5 వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 2,500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. లైసెన్సు కలిగిన సర్వేలు గా మారెందుకు ఇటుక సువర్ణ అవకాశమని, అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.