calender_icon.png 12 May, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్షులుగా ఎస్కే పాషా

11-05-2025 07:33:22 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా ఎస్కే పాషా, కార్యదర్శిగా అజ్మీర్ రామ రవిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనీ తెలంగాణ కేంద్ర 4వ తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఆదివారం  భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల డివిజన్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో, భద్రాచలం డివిజన్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక జరిగింది.

అధ్యక్షులుగా ఎస్కే పాష, సహాయ అధ్యక్షులుగా  వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మల్లికార్జునరావు, రాజశేఖర్ ,కార్యదర్శిగా రామ్ రవి, సంయుక్త కార్యదర్శిగా చంద్రశేఖర్, లక్ష్మణ్ లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. భద్రాచలం డివిజన్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో 4వ తరగతి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.