calender_icon.png 7 June, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలతోనే జీవన మనుగడ

05-06-2025 08:17:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): మొక్కలతోనే జీవన మనుగడ సాధ్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చెట్లు మనకు నీడను, ఆక్సిజన్‌ను అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు ఆక్సిజన్ కొరకు పోరాడే దుస్థితి ఏర్పడుతుందని అన్నారు.

కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ తమ జన్మదినాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.