అన్నయ్యనా..! బావగారా?
టాలీవుడ్ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భార్య అన్నా లెజి నోవా ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఆమె ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఎంతో కాలంగా ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నానని.. ఇప్పుడు సరైన సమయం వచ్చిందని అందుకే ఓపెన్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇదిలావుండగా, అన్నా లెజి నోవా తాజాగా పవన్‌కల్యాణ్ సోదరులు చిరంజీవి, నాగబాబులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు.
‘అన్నయ్యనా.. బావగారా?’ అంటూ వారిద్దరితో దిగిన ఫొటోలకు ఆసక్తికరమైన వ్యాఖ్యలను జోడించారు. ‘ఒకరి పై ఒకరు ఎప్పుడూ ప్రేమానురాగాలు చూపిస్తూ ఉండే ఈ మెగా కుటుంబంలోకి దాదాపు 15 ఏళ్ల క్రితం అడుగుపెట్టాను. వచ్చి న కొత్తల్లో ఇక్కడ ఎలా ఉండాలో.. ఎవరిని ఎలా పిలవాలో అర్థం కాలేదు. దీంతో నా భర్త (పవన్‌కల్యాణ్) వాళ్లను ఎలా పిలుస్తున్నారో గమనించి.. నేనూ అలానే పిలిచేదాన్ని.
చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబును చిన్నన్నయ్య అని అనేదాన్ని. మొదట మామూలుగా అన్నయ్య అని పిలిచా.. కానీ, ఆ తర్వాతే ఆ బంధం గొప్పతనం అర్థమైంది. తర్వాత నేను ‘బావ గారు’ అని పిలవడం నేర్చుకొన్నా. నాకు అన్నదమ్ములు లేరు.. కానీ, ఈ బంధం నాకు చిరంజీవి, నాగబాబుల రూపంలో ఇద్దరు సోదరులను ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చేసిన గంట లోపే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.




