2 July, 2026 | 1:08 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

హెచ్చరికలు లేకుండా సాత్నాల గేట్లు ఎత్తివేత

09-09-2024 03:29 AM
  1. వాగులో పెరిగిన వరద ఉధృతి.. చిక్కుకున్న రైతులు 
  2. ఆరుగురిని కాపాడిన గ్రామస్థులు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగులో వరద ఉధృతి పెరిగి ఆరుగురు రైతులు చిక్కుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలంలోని పెండలాడకు చెందిన ఆరుగురు రైతులు శనివారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని ఎండ్లబండిపై ఇంటికి వెళ్తూ వాగు దాటుతున్నారు.

అదే సమయం లో సాత్నాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు 2 గేట్లు ఎత్తారు. దీంతో వాగులో నీటి ప్రవాహం పెరిగి రైతులు ఎడ్లబండితో సహా చిక్కుకున్నారు. గమనించిన గ్రామ స్థులు అప్రమత్తంగా వ్యవహరించి రైతులను, ఎడ్లను ఒడ్డుకు చేర్చడంతో  పెను ప్రమాదం తప్పిం ది. అధికారులు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవడంలేదని, సమయపాలన పాటించడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.