calender_icon.png 18 January, 2026 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

09-09-2024 10:11:32 AM

దామరచర్ల : నల్లగొండ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.  దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో కారును ఢీకొట్టి పక్కనే నెట్ కేబుల్ మరమ్మతు చేస్తున్న ఇద్దరిపైకి దూసుకెళ్లి డీసీఎం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని  వాడపల్లి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.