11 August, 2026 | 3:36 AM

నేడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

11-08-2026 01:18 AM

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో మంగళవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా బలమైన ఉపరితల గాలులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే తరహా వాతావరణం ఈనెల 13 వరకు రాష్ట్రంలో ఉంటుందని పేర్కొంది.