అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
11-08-2026 01:19 AM
జవహర్‌నగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): జవహర్నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ మేయర్, జవహర్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. డ్రైనేజీ, రోడ్డు సమస్యల పరిష్కారంతో స్థానికులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బలి శ్రీనివాస్, శంకర్, యాదగిరి గౌడ్ కాలనీవాసులు పాల్గొన్నారు.






