పరుగుల పోలీస్ లింగారెడ్డి
అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు
మహబూబాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): దేశ రక్షణ కోసం సైన్యంలో చేరేందుకు దేహదారుధ్యాన్ని పెంపొందించుకోవడానికి చేసిన శారీరక శ్రమను 26 ఏళ్లుగా కొనసాగిస్తూ.. రక్షణతో పాటు ర న్నింగ్‌లో తనదైన శైలిలో రాణిస్తూ అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పా ల్గొని పరుగుల పోలీసుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ లింగారెడ్డి. మ హబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన మంచి కంటి లింగారెడ్డి మిలటరీలో చేరాలని పట్టుదలతో చేసిన ప్రయత్నం 2001లో ఫలించింది.
సైన్యంలో చేరిన తర్వా త 2019 వరకు రక్షణ రంగంలో పనిచేశాడు. నాలు గేళ్లు విధులు నిర్వహించి 2019లో పదవి విరమణ చేసి 2024లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. అ ప్పటి నుంచి లింగారెడ్డి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే, జాతీ య, అంతర్జాతీయ ర న్నింగ్, మారధాన్ పో టీల్లో పతకాలను కైవ సం చేసుకుంటున్నా రు. అంతర్జాతీయ స్థా యిలో చండీగఢ్ ఇంటర్నేషనల్ మారథాన్ (21 కి. మీ) 3వ స్థానం, ఎన్‌ఎండీసీ ఫుల్ మా రథాన్ (42.195 కి.మీ) 4వ స్థానం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్ (10 కి.మీ) మొదటి స్థానంలో నిలిచారు.
జాతీ య స్థాయిలో ఆలిండియా పోలీస్ ఫుల్ మా రథాన్, జలంధర్ (42.195 కి.మీ) 5వ స్థానం, ఇండియన్ నేవీ మారథాన్, విశాఖపట్నం (21 కి.మీ) 1వ స్థానం, వైజాగ్ మా రథాన్ (21 కి.మీ) 3వ స్థానం, పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026 (హైదరాబాద్): ఫుల్ మారథాన్ (42.195 కి.మీ) 1వ స్థానం, క్రాస్ కంట్రీ (10 కి.మీ) 2వ స్థానం, 10,000 మీటర్లు 2వ స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ (10 కి.మీ), హైదరాబాద్ 3వ స్థానం, యాదగిరి గుట్ట టెంపుల్ రన్ (21 కి.మీ) 1వ స్థానం, కరీంనగర్ హాఫ్ మారథాన్ (21 కి.మీ) 3వ స్థానం, థానుకూ రోడ్ రన్ (10 కి.మీ), ఏపీ 1వ స్థానంలో నిలిచారు.




